అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ రచయిత్రిని ఆయన లైంగికంగా వేధించాడని న్యూయార్క్ జ్యూరీ తేల్చింది. దీంతో ఆమెకు పరిహారంగా 5 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ఆదేశించింది. 1996లో మాన్ హటన్ అవెన్యూ లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, అనంతరం తనను పలుమార్లు లైంగికంగా వేధించాడని ప్రముఖ రచయిత్రి ఇ.జీన్ కారెల్ ట్రంప్ పై పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు.