వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి పీలేరు మాజీ సర్పంచ్ ఏఎస్ హుమయూన్ ను వరించింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంగళవారం తిరుపతిలో కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. హుమయూన్ 20 సంవత్సరాలుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడిగా ఉన్నారు. 2001 నుండి 2007 వరకు, 2013 నుండి 2018 వరకు పీలేరు గ్రామపంచాయతీకి సర్పంచ్ గా స్థానిక ప్రజలకు సేవలందించారు. అలాగే ఆయన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులుగా, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేశారు.
సేవా దృక్పథంతో అందరివాడిగా ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండే ఆయన్ను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గుర్తించి వైసిపి రాష్ట్ర కార్యదర్సిగా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా హుమయూన్ మంత్రి, ఎంపి, ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అలాగే తనకు ఈ పదవి రావడానికి సహకరించిన పార్టీ ఇతర నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పుకున్నారు. పార్టీ ఆదేశాల మేరకు పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు.