అనకాపల్లి జిల్లా యలమంచిలి, రేగుపాలెం రైల్వే స్టేషన్లు మధ్య మంగళవారం ఉదయం పది గంటల ప్రాంతంలో యలమంచిలికి చెందిన బల్లిన జగన్నాథ్ రావు(32) అనే వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్టు తుని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ మారుఫ్ ఒక ప్రకటన విడుదల చేశారు. దర్యాప్తులో మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్టు, మృతుడు అచ్యుతాపురం సెజ్‌లో ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్నట్టు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, మార్చరీ అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించామని, దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.