కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరి స్నేహితుల మద్య వాగ్వాదం జరిగి ఒకరికి గాయాలైన ఘటన మంగళవారం ఐదవపట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పి. అప్పన్న బతుకుతెరువుకోసం విశాఖకు వచ్చారు. పోర్టులో కూలిపనులకు పిలిస్తే వెళ్తుంటాడు. జ్ఞానాపురం బ్రిడ్జి కిందనే జీవనం సాగిస్తుంటాడు. ఇతనితో పాటు ఇతని స్నేహితుడు కూడా కలిసి కాంట్రాక్టర్లు ఎవరైనా పని ఉండి పిలిస్తే వెళ్తుంటారు. అయితే మంగళవారం ఉదయం అప్పన్న అనే వ్యక్తి బ్రిడ్జి కింద కూర్చొని ఉండగా మరో వ్యక్తి మద్యం మత్తులో అప్పన్నను దుర్భాషలాడి, పక్కనే ఉన్న బీరు సీసాతో అప్పన్న ఛాతీపై కొట్టడంతో గాయాలయ్యాయి. అప్పన్న ఫిర్యాదు మేరకు కంచరపాలెం' సీఐ ఎస్ విజయకుమార్ నేతృత్వంలో ఎస్ఐ రవికిషోర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.