విశాఖపట్నం జిల్లా ప్రెస్ అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా గ్రేటర్ న్యూస్ సంపాదకులు నిట్టల శ్రీనివాసరావు నియమితులయ్యారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంగళవారం విడుదల చేసిన ఆరు సభ్యులు జాబితాలో శ్రీనివాసరావు స్థానం సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిన్న మధ్య తరహా పత్రికల కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన గతంలో విశాఖపట్నం జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర పౌర సమాచార సంబంధాలు శాఖ అధికారులు, మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 1989లో ఉదయం పత్రిక ద్వారా పాత్రికేయునిగా అడుగుపెట్టిన ఆయన అంచలంచలుగా వివిధ పత్రికల్లో వేర్వేరు హోదాలలో పనిచేశారు. 2005లో గ్రేటర్ న్యూస్ దిన పత్రికను స్థాపించి సమర్థవంతంగా నడుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కలిగిన ఈ పత్రిక రాష్ట్రంలోని పలు జిల్లాలలో సమర్థవంతంగా విడుదలవుతుంది. ఈ పత్రిక ద్వారా పలువురు పాత్రికేయులు, సహ సంపదకులు, ఆపరేటర్లు తయారయ్యారు. వీరు వివిధ దినపత్రికలలో పనిచేస్తున్నారు. గ్రేటర్ న్యూస్ శ్రీనివాస్ కు జిల్లా అక్రిడేషన్ కమిటీలో స్థానం లభించడం పట్ల పలువురు పాత్రికేయులు హర్షం వ్యక్తం చేశారు.