గాజువాక మండలం సుకృతి అపార్ట్మెంట్ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మంగళవారం హామీ ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సాధ్యమైనంత తొందరలో పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.