అమరావతి రైతుల విషయంలో కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే వైయస్ జగన్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకునేందుకు చంద్రబాబు రైతు యాత్ర పేరుతో తిరుగుతున్నాడన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం రూపొందించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. వైయస్ జగన్ ప్రభుత్వం ప్రతీ రైతుకు న్యాయం చేస్తుందన్నారు.