శ్రీశైలంలో ఈనెల 25 నుంచి 31 వరకు జరగనున్న మహారుద్ర శతచండీ వేదస్వాహాకార పూర్వక మహాకుంభాభిషేక మహోత్సవానికి సీఎం జగన్ ని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల దేవస్థానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ఈవో లవన్న, వేద పండితులు ఆహ్వానించారు. అనంతరం సీఎం వైయస్ జగన్కు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదమంత్రాలతో వేదపండితులు ఆశీర్వదించారు.