విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 12 నుంచి 17 వరకు ఏపీ ప్రభుత్వం–దేవదాయ ధర్మదాయ శాఖ నిర్వహణలో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహించనున్నారు. విజయవాడలో జరగనున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ను డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, వేద పండితులు ఆహ్వానించారు.