హైదరాబాద్కు చెందిన తెలుగు ఇంజనీర్ వీరగంధం శరత్ బాబు(58) జార్ఖండ్లో హత్యకు గురయ్యారు. ఏపీకి చెందిన ఒక పవర్ ప్రాజెక్టు అనుబంధ సంస్థలో ఇంజనీరుగా పనిచేస్తున్న ఆయన్ను మంగళవారం దుండగులు హత్య చేశారు. మావోయిస్టులు ఆయన్ను అంతం చేసినట్లు మొదట సమాచారం అందినా స్థానిక గూండా లు ఆ పనికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శరత్ బాబు కుటుంబం హైదరాబాద్లో నివసిస్తోంది.