పార్వతీపురం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం కుక్కుడి పంచాయతీలో ఘోర సంఘటన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే...... కుక్కిడి పంచాయతీకి చెందిన 15 మంది శిఖలపై అనే సమీప గ్రామంలో వివాహ వేడుకకు ప్రయాణమాయ్యరు. పికప్ వ్యాన్‌లో వారంతా పయనమయ్యారు. అయితే మరికొద్ది నిమిషాల్లో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి చేరేలోపు ఊహించని ప్రమాదం జరిగింది. ఎదరుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి పికప్ వ్యాన్ బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న 15 మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు ఆటోల సాయంతో భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. స్వల్పగాయాలైన వారికి ప్రథమ చికిత్స అందించి ఇళ్లకు పంపించారు. కాగా క్షతగాత్రుల్లో ఎస్.నేలమ్మ, హారిక కృష్ణారావు, ఎస్.వసంతకుమార్, ఎ.మంజు, ఎస్.చంద్రమ్మ, ఎస్.శిరీష, ఎస్.వరుణ్‌లను మెరుగైన చికిత్స కోసం పార్వతీపురంలో జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎల్విన్‌పేట ఎస్ఐ షన్ముఖరావు తెలిపారు.