శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని వైయస్సార్సీపి పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ని ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్సిపి ముస్లిం మైనార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మైనార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఆత్మకూరు నుండి మద్రాస్ వరకు, రూ. 2. 24 కోట్లు నిధులు మంజూరు చేయించినందుకు వారికి ముస్లిం మైనార్టీ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణం, మండలం, గ్రామం, వార్డు ముస్లిం మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.