పవన్ కళ్యాణ్ వాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పవన్ మదిలో ఏముందో తేలిపోయిందని, చంద్రబాబు పల్లకీ మోయడమే పవన్ ఎజెండా అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ నీటి బుడగ లాంటిదని, తనకు సొంత బలం లేదని పవన్ ఒప్పుకున్నారని సజ్జల పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు సీఎం కావాలని కలలు కన్నారని, అయితే అభిమానుల కలలను పవన్ చంద్రబాబుకు తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించారు. తనకు బలం లేదని చెబుతున్న పవన్ కి రాజకీయాలకు కొత్త కాదు. 2010 నుంచి రాజకీయాల్లో ఉన్న ఆయన.. 12 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నా సొంతంగా ఎందుకు ఎదగలేకపోయారు? జగన్ 2011లో వైఎస్సార్ మరణం తర్వాత పార్టీ పెట్టి ఏ స్థాయికి ఎదిగాడో చూశాం. రాజకీయాల్లో పవన్‌కి కూడా అంత సీనియారిటీ ఉంది అని అన్నారు.