మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పొత్తులపై పవన్ కళ్యాణ్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థిని కానని పరోక్షంగా వెల్లడించారు. సీఎం కుర్చీని గట్టిగా అడిగి తీసుకోగల బలం ప్రస్తుతానికి జనసేనకు లేదు అని అన్నారు. ఏపీని వైసీపీ నుంచి విముక్తం చేయడమే తమ ప్రధాన ఎజెండా అని, ఈ దిశగా కలిసొచ్చే పార్టీలతో పొత్తు ఉంటుందని వివరించారు. గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశాం. అప్పట్లో 30-40 సీట్లు గెలిచి ఉంటే ఈరోజు సీఎం అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉండేది. జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందన్న నమ్మకం ఉండేది. కర్ణాటకలో కుమారస్వామిలా చక్రం తిప్పాలంటే చేతిలో 30-40 సీట్లు ఉండాలి. ఈసారి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అని అన్నారు. జూన్ నుంచి మంగళగిరిలోనే ఉండి వేసి కార్యకలాపాలు ముమ్మరం చేస్తాం. ఈసారి వైసీపీని ఎదుర్కొనేందుకు గట్టిగా పోరాడతాం అని అన్నారు.