చుక్కల భూముల చిక్కులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు నేడు జగన్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనుంది. చుక్కల భూములకు సర్వ హక్కులూ రైతులకే ఇచ్చేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ. 20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలిలో జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.