ఈ ఏడాది నుంచి డిగ్రీలో కొత్తగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సును ప్రవేశపెట్టారు. ఇది ఇంజనీరింగ్‌లో సీఎస్‌సీ కోర్సుకు సమానమని అధికారులు తెలిపారు. దోస్త్ నోటిఫికేషన్ విడుదల వేళ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పేరుతో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి 11 ప్రభుత్వ డిగ్రీ, అటానమస్ కాలేజీలు ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు ముందుకొచ్చాయని, ఒక్కో కాలేజీలో 60 సీట్లతో అనుమతులిచ్చామని తెలిపారు.