అగ్నివీర్‌లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేలో నాన్-గెజిటెడ్ ఉద్యోగాల్లో రెండు అంచెల్లో వీరికి 15% రిజర్వేషన్ లభించనుంది. అలాగే వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. దేహదారుఢ్య పరీక్షల నుంచి వారికి మినహాయింపు ఉంటుంది. లెవెల్-1లో 10%, లెవెల్-2.. అంతకుమించిన నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్‌ను అగ్నివీర్‌లకు కల్పిస్తారు. వీరి కోసం రిజర్వేషన్ విధానాన్ని RPF కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం.