పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామానుజ ఉత్తర్లపల్లి గ్రామంలో ఇటీవల చోరగుడి పెద్ద యేసుబు అగ్ని ప్రమాదానికి గురై ఇల్లు దగ్ధమైన సందర్భంగా శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెడన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్, చోరగుడి పెద్ద యేసుబు కుటుంబానికి 5000 రూపాయలు నగదు తోపాటు బియ్యం కట్టను అందించడం జరిగింది. చోరగుడి పెద్ద యేసుబు ఇల్లు కట్టుకోడానికి కుడా తెలుగుదేశం పార్టీ తరపున సహకరం ఉంటుందని ఈ సందర్బంగా పెడన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ బాధితుడికి హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతన స్వామి, పార్టీ నాయకులు గోపి నాగబాబు, బొర్రా శ్రీనివాసరావు, పోతుల రాము, పాలగాని సిద్దు, మట్టా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.