వీరులపాడు మండలంలోని పెద్దాపురం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి. అని గత పాలకుల మాదిరిగా మాటల్లో చెప్పకుండా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతల్లో చూపుతున్నారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందజేస్తూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యపాలనను సాకారం చేస్తూన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ పాలనతో యావత్తు దేశం రాష్ట్రం వైపు చూస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ పరిపాలన తీరును - సంక్షేమ పాలనను దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయా ముఖ్యమంత్రులు అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు జగనన్న కు చెబుదాం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారని, ప్రజల్లో జగన్ కు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు నాయుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని, వైయస్ జగన్ పై తప్పుడు ప్రచారాలతో బురదచల్లేందుకు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి అండగా ఉండి రానున్న ఎన్నికల్లో మద్దతు పలికి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిప్పులపల్లి శాంతమ్మ, ఎంపీపీ కోటేరు లక్ష్మీ ముత్తారెడ్డి, జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు, సొసైటీ చైర్మన్ ఆవుల ప్రసాద్, ఉపసర్పంచ్ భవిరిశెట్టి లక్ష్మి, పద్మా రెడ్డి, దేవస్థానం కమిటీ చైర్మన్ బొజ్జ అనురాధ, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.