ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రోడ్డుషోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది. కాగా.. బహిరంగ సభలు, రహదారులపై రోడ్ షోలను కట్టడి చేసేలా ఈ ఏడాది జనవరి 2న ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 1ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.