రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఉదయం 5గంటలకు మహామంగళ వాయిద్య హృద్య నాదం, భగవత్ ప్రీతిగా వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర–విష్వక్సేన పూజలు, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అజస్ర దీపారాధన తదితర కార్యక్రమాలు మొదలయ్యాయి. సీఎం జగన్ యజ్ఞ సంకల్పం తీసుకున్న అనంతరం మహాయజ్ఞం ప్రారంభమైంది. గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్.. కపిల గోవుకు హారతి ఇచ్చారు. అనంతరం అఖండ దీపారాధనలో పాల్గొన్నారు.