చుక్కల భూముల సమస్యలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చెక్ పెడుతున్నారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నారు. శుక్రవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు కలుగుతుంది. దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల భూములపై రైతులకు సర్వ హక్కులు కలగనున్నాయి.