ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఈ-రిక్షా బ్యాటరీ పేలి ముగ్గురు మరణించారు. అంకిత్ కుమార్ గోస్వామి అనే వ్యక్తి భార్య, ముగ్గురు పిల్లలు, కోడలితో కలిసి నివసించేవాడు. ఈ రిక్షా నడుపుతూ జీవనం సాగించే అంకిత్, రోజులాగే రిక్షా నడిపి గురువారం రాత్రి ఇంటికి వచ్చాడు. ఈరిక్షా బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టగా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో అంకిత్ భార్య, కుమారుడు, కోడలు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.