ఒంటరిగా పోటీ చేయలేను..నాకు ఎవరి తోడో కావాలని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నాకు తెలిసిన ఇప్పుడున్న 26 జిల్లాలకే అధ్యక్షులు లేరు..కనీసం ఉమ్మడి జిల్లాలైన 13 జిల్లాలకీ అధ్యక్షులు లేరు. జిల్లా అధ్యక్షులే లేనప్పుడు ఈ మండలాధ్యక్షులు ఎక్కడి నుంచి వచ్చారు..? అని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... నా విధానం ఇది...దీన్ని మీరందరూ అంగీకరించాలని చెప్పేందుకు ఈ రోజు సమావేశం పెట్టినట్లుంది. మేం దాదాపు ఏడాది క్రితం నుంచి ఈయన పవర్‌స్టార్ కాదు..ప్యాకేజీ స్టార్ అని చెప్తూనే ఉన్నాం. ఈయన పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం అని మొదటి నుంచీ చెప్తూనే ఉన్నాం. మేం ఆ వాస్తవాన్ని చెప్తే ఓ రోజు కాలు చూపించాడు..మరో సారి చెప్పు చూపించాడు. ఇప్పుడేం చూపిస్తాడు..? ఇప్పుడు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు చెప్పులు చూపించాలి. రాజకీయంగా పూర్తిగా సిగ్గు శరం వదిలేసి బట్టలొదిలేశాడు. ఎవరేమనుకున్నా పర్లేదు...నేను చంద్రబాబుకు అమ్ముడుపోతాను అని తేటతెల్లం చేశాడు. ఇంకా ఎవరికైనా అపోహలేమైనా ఉన్నాయో ఏమోనని నిన్నా, ఇవాళ నివృతి చేశాడు అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa