ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలం లేదన్న విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 12:26 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అవసరాలకు పెట్టిన టెంట్‌ హౌజ్‌ పార్టీనే జనసేన అని, పవన్‌ రాజకీయాలు కూడా కూడా చంద్రబాబు కోసమే నడుస్తున్నాయని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎద్దేవా చేశారు. పొత్తులపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై నాని స్పందిస్తూ..  బలం లేదన్న విషయం పవన్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా?. పార్టీ పెట్టిన సమయంలోనే బలం లేదని పవన్‌కు తెలుసు. అప్పుడు బలం లేదు కాబట్టి పోటీ చేయలేదని చెప్పాడు. మరి 2019లో ఎందుకు పోటీ చేశాడు?. ఎందుకంటే.. 2019లో చంద్రబాబుకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆ ఓట్లు వైయ‌స్ జగన్‌కు పడకుండా చీల్చడానికే జనసేన పోటీ చేసింది. నా బాధ అంతా ఒక్కటే. పవన్‌ను నమ్ముకుని సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌ సైతం వదులుకుని.. పవన్‌ను సీఎం చేస్తామంటూ కంకణం కట్టకుని కొందరు ఊరురా తిరుగుతున్నారు. వాళ్లు తమ త్యాగాలను మానుకుని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాల‌ని పేర్ని నాని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa