శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని 200 పడకల జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం 5.15 నుంచి 6 గంటల వరకు కరెంటు పోవడంతో ఇలా సెల్ఫోన్ల వెలుగులో చికిత్స చేశారు. బాత్రూమ్లో జారిపడి తలకు గాయాలైన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు ఆ సమయంలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. కరెంటు లేకపోవడంతో.. అత్యవసర వైద్య సిబ్బంది సెల్ఫోన్ లైట్ వెలుతురులోనే సేవలు అందించారు. ఆస్పత్రిలో 165 కేవీ జనరేటర్ ఉన్నా.. వాడటం లేదని, నిత్యం ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలిపారు.