ఏపీఈఏపీసెట్-2023 పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 19 వరకు తొమ్మిది సెషన్లలో ఎంపీసీ స్ర్టీమ్ పరీక్షలు, 22, 23 తేదీల్లో నాలుగు సెషన్లలో బైపీసీ స్ర్టీమ్ పరీక్షలు జరుగుతాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులో ప్రవేశాలకు మొత్తం 3,37,733 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌లో పరీక్షల కోసం ప్రభుత్వం 136 సెంటర్లు ఏర్పాటుచేసింది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12, మధ్యాహ్నం 3 నుంచి 6గంటల వరకు పరీక్షల జరుగుతాయి. ఈ పరీక్షలకు నిమిషం నిబంధన అమలుచేస్తున్నారు. పరీక్ష ప్రారంభ సమయానికి నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించరు.