విజయనగరం జిల్లా, ఎస్.కోటలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించేందుకు ఈనెల 18న పట్టణానికి వస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేబీఏ రాంప్రసాద్ ఆదివారం పరిశీలించారు. చంద్రబాబు నాయుడు బసచేసే గ్రీన్‌సిటీ ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం సభ ఏర్పాట్లు, పర్యటనకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయ కులు లాలం అర్జునరావు, కొట్యాడ రమణమూర్తి, కొట్టాన విజయ్‌కుమార్, భూపాల్‌నాయుడు, మల్లా రామకృష్ణ, గోల్జాం రమణ పాల్గొన్నారు.