ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లా దాటిన మద్యం షాపులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 15, 2023, 10:37 AM

 ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రాజాం, పాలకొండ, కొత్తూరు మండలాల్లో గల 36 మద్యం షాపులు విజయనగరం జిల్లాకు బదిలీ చేస్తున్నట్లు శ్రీకాకుళం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శంకరయ్య ఒక ప్రక టనలో తెలిపారు. జిల్లాల పునర్విభజన కాక ముందు ఈ మూడు మండ లాల మద్యం షాపులు శ్రీకాకుళం జిల్లాలో ఉండేవని పేర్కొన్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు బదిలీ చేయాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ ఆదే శాలు జారీ చేయడంతో జూన్‌ ఒకటో తేదీ నుంచి ఈ 36 దుకాణాలు విజ యనగరం జిల్లా పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఇప్పటివరకు ఈ మండ లాలకు చెందిన 36 మద్యం షాపులకు ఎచ్చెర్ల బేవరేజ్‌ నుంచి మద్యం సర ఫరా చే యడమే కాకుండా పర్యవేక్షణ కూడా ఉండేదని, జిల్లా బదిలీ చేసిన తర్వాత విజయనగరం ఎక్సైజ్‌ అఽధికారుల పర్యవేక్షణలోకి వెళ్తాయని పేర్కొ న్నారు. అంతే కాకుండా మద్యం నెలిమర్ల నుంచి సరఫరా చేయనున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com