సీఎం జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు కర కట్టపై ఉంటున్న గెస్ట్‌హౌ్‌సను ఎటాచ్ చేస్తూ ఆదివారం నోటీసులు జారీ చేయడాన్ని తప్పుపట్టారు. అవినాశ్‌రెడ్డి అరెస్టును పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు అద్దెకుంటున్న ఇంటికి నోటీసులిచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు.. జగన్లాగా పుట్టుకతో జమిందారు కాదని, ఆయన కరకట్టపై అద్దెకు మాత్రమే ఉంటున్నారని స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్‌రెడ్డి, జగన్ బయటపడడం అసాధ్యమన్నారు. లింగమనేని, జగన్‌కు మధ్య ఏమైనా ఉంటే వాళ్లు చూసుకోవాలి కానీ, మధ్యలో చంద్రబాబును ఎందుకులాగుతారని ప్రశ్నించారు.