కర్నాటక ఎన్నికల్లో బీజేపీ అవినీతి, అసమర్ధ పరిపాలనకు వ్యతిరేకంగా కన్నడ ప్రజలు ఓటు వేశారని, అది బీజేపీ పతనానికి నాంది అని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మార్టిన్‌లూథర్ పేర్కొన్నారు. కోరుకొండలో ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవం ర్యాలీ నిర్వహించారు. స్థానిక అల్లూరి సీతారామరాజు జంక్షన్ వద్ద బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఐదు అంశాలపై వచ్చిన మ్యానిఫెస్టోను కన్నడ ప్రజలు విశ్వసించారని, జోడోయాత్ర కర్నాటకలో 17 రోజులు జరిగిందని, మంచి ఫలితాలిచ్చిందని లూథర్ పేర్కొన్నారు. కార్యక్ర మంలో పార్టీ మండలాధ్యక్షుడు గరగ శ్రీధర్‌బాబు, సర్పంచ్ కర్రి లక్ష్మీ సరోజ, శ్రీనివాస్ వడయార్, పాకా సురేష్, డాక్టర్ వాసు, నల్లా వీర్రాజు పాల్గొన్నారు.