పప్పు... పప్పు అని ఎవరినైతే అవమానించారో, ఎవరినైతే హేళన చేశారో, ఇప్పుడా వ్యక్తే నిప్పు కణికలా మారి అగ్నిగుండమై మిమ్మల్ని దహించడానికి సిద్ధమయ్యాడు ముఖ్యమంత్రి గారూ అంటూటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడువర్ల రామయ్య హెచ్చరించారు. నారా లోకేశ్ పాదయాత్రకు సంఘీభావంగా నేడు రాష్ట్రంలోని 173 నియోజకవర్గాల్లో జరిగిన పాదయాత్రలు, కార్యక్రమాలు చూసి అధికార పార్టీ ఉలిక్కిపడిందని అన్నారు. 400 రోజులు, 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి సంకల్పించిన ఆ బిడ్డను ఆశీర్వదించడం కోసం, ఆ బిడ్డకు మద్దతు పలకడం కోసం, ఆ బిడ్డకు ధైర్యం పలకడంకోసం, ఆ బిడ్డను వీపు తట్టి ప్రోత్సహించడం కోసం నేడు సంఘీభావయాత్రలు జరిగాయని వెల్లడించారు.
రాష్ట్రంలో జరిగిన సంఘీభావయాత్రలు చూశాక మీ వెన్నులో చలి రావడం లేదా? నిజం చెప్పండి సజ్జల గారు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి... మీరు దిక్కుతోచని స్థితిలో లేరా? అని నిలదీశారు. పాదయాత్రలో 300 రోజులు, 2,740 కిలోమీటర్లు పూర్తయితే మీ పని అవుట్ జగన్మో హన్ రెడ్డిగారు, సజ్జల రామకృష్ణారెడ్డిగారు... మరలా మీరు, మీ గుమస్తాగిరికి వెళ్లడమే అని వ్యంగ్యం ప్రదర్శించారు.