సీబీఐ కొత్త డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియామకం విషయం చర్చనీయంగా మారింది. గా ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. ప్రధానమంత్రి మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి తో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఈ నియామకాన్ని ఖరారు చేసింది. సీబీఐ ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ పదవీ కాలం ఈ నెల 25తో ముగియనుంది. ఆ తర్వాత ప్రవీణ్ ఈ పదవిలోకి రానున్నారు. అయితే, ప్రవీణ్ నియామకంపై అధిర్ రంజన్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.