తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఎండలు పెరిగాయి. మరో వారం రోజులు ఇలానే ఉండనుంది. అవసరమైతే తప్పా బయటికి రావద్దు. రైతులు, కూలీలు, ఎండలో ఉండే చిరు వ్యాపారులు, ట్రాఫిక్ పోలీసులు, నీడలో పని చేసేలా చూసుకోవాలి. అరగంటకు ఒకసారి నీళ్లు తాగాలి. చిన్నారులు, గర్భిణిలు, వృద్దులు బయటికి రావద్దు. వేడిగాలి తాకకుండా, వడదెబ్బ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవర్లు వాహనాల పట్ల జాగ్రత్తలు తీసుకొని నడపాలి.