చిత్తూరు నగరంలో మహిళా హోంగార్డు హరిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్ళితే..... జానకారపల్లెలో నివాసం ఉంటున్న హరిత, ఆమె భర్త నాగరాజు ఇద్దరూ హోంగార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా హరిత అనారోగ్యానికి గురైంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి తమ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa