బాపట్ల జిల్లా, నిజాంపట్నంలో జరిగిన మత్సకార భరోసా సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు 175 నియోజకవర్గాలలో బరిలోకి దిగే సత్తా లేదన్నారు. కనీసం 175 స్థానాల్లో చంద్రబాబు పార్టీ రెండో స్థానం కూడా వస్తుందా అని నమ్మకం కూడా చంద్రబాబుకు లేదని తెలిపారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టలేని వారు ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. చంద్రబాబు పార్టీ వెంటిలేటర్‌పై ఉందని.. అందుకే దత్తపుత్రుడుని నమ్ముకున్నారన్నారు. ఇదే దత్తపుత్రుడిని జనం ఎమ్మెల్యేగా కూడా పనికిరారని ఓడించారని అన్నారు. ‘‘బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నది వీల్లే. పెళ్లి చేసుకున్నది వీల్లే, విడాకులు ఇచ్చేది వాళ్లే.. మళ్లీ పెళ్లి చేసుకున్నది.. మళ్లీ విడాకులు ఇచ్చేది వీల్లే. చంద్రబాబు కలిసి వెల్దాం అన్నారు. దత్తపుత్రుడు చిత్తం ప్రభు అన్నారు. చంద్రబాబుకు ఏది మంచి జరిగితే అలాగే చేస్తానని దత్తపుత్రుడు చెబుతారు. పోటీ వద్దని చెబితే అలాగే చేస్తాడు.చంద్రబాబు గాజువాక రానంటారు, దత్తపుత్రుడు మంగళగిరిలో పోటీ పెట్టకుండా ఆగుతాడు. చంద్రబాబు చెబితే బీజేపీతో దత్తపుత్రుడు తెగదెంపులు చేసుకుంటారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం దత్తపుత్రుడు ఏం చేయటానికైనా వెనకాడరు’’ అంటూ జగన్ విరుచుకుపడ్డారు.