అసోంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ‘లేడీ సింగం’గా పేరుగాంచిన పోలీసు అధికారి జున్మోనీ రాభా దుర్మరణం పాలయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. సోమవారం జరిగిందీ ఘటన. రాభా తన ప్రైవేటు వాహనంలో ప్రయాణిస్తుండగా అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న కంటైనర్ను కారు ఢీకొట్టింది.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాభాను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో సివిల్ దుస్తుల్లో ఉన్న ఆమె ఎక్కడికి వెళ్తున్నారన్న విషయంలో స్పష్టత లేదని జిల్లా ఎస్పీ తెలిపారు.