చేబ్రోలు మండలంలోని గుండవరం గ్రామంలో గల గంగమ్మ రేణుకమ్మ అంకమ్మ తల్లుల ఉత్సవాల బుధవారం ఘనంగా జరిగాయి. అమ్మవార్లను కృష్ణా నదికి స్నానానికి తీసుకెళ్లడం మాతా కళ్యాణం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఊరేగింపులో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గురువారం ముగింపు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కొలుపుల కమిటీ సభ్యుడు దానబోయిన శివయ్య విలేకరులకు తెలిపారు.