రాష్ట్ర ఉర్దూ అకాడమీ బోర్డు సభ్యులుగా ముగ్గురిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన షేక్ అబ్దుల్ కలీం, కృష్ణా జిల్లాకు చెందిన షేక్ దిల్షాద్ నజరానా, నంద్యాల జిల్లాకు చెందిన ఎస్. ముర్తజ్వలీలను సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లపాటు వీరు ఆ పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.