ఇటీవల నిర్వహించిన వాణిజ్య ప్రయోగం విజయవంతం కావడంతో జోష్ మీదున్న ఇస్రో.. మరో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈ నెల 29న జీఎస్ఎల్వీ-మార్క్2 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. 2016 ఏప్రిల్ 28న పీఎ్‌సఎల్వీ-సీ35 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎ్‌సఎ్‌స-1జీ ఉపగ్రహ కాల పరిమితి ముగిసిపోవడంతో దాని స్థానంలో ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. దేశంలో సొంత నావిగేషన్ వ్యవస్థకు ఇస్రో శ్రీకారం చుడుతోంది.