ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెల్లపాడు గ్రామంలో ఘోర ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా హైదరాబాద్లో నివాసం ఉంటారు. తిరునాళ్ల కోసం రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం రాధకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో... అక్కడకు వెళ్లిన రాధ రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు దిగారు. అనుమానం వచ్చిన రాధ కోసం గాలించిన కుటుంబసభ్యులకు రోడ్డు పక్కనే రాధ మృతదేహం కనిపించింది. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా రాధ ఉన్న చోటును గుర్తించారు. బెంగుళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నానంటూ ఆమె స్నేహితుడు కాశిరెడ్డి రూ.70లక్షలు అప్పుడు తీసుకున్నాడని, తిరిగి ఇస్తానంటూ ఫోన్ చేసి పిలిపించి హత్య చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.