చంద్రబాబు-పవన్‌కళ్యాణ్‌లను తిట్టేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాధనంతో మీటింగ్‌లు పెడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు అంతా ఒక్కటవుతున్నామన్న పవన్ వ్యాఖ్యలను ప్రజలు స్వాగతించడంతో ముఖ్యమంత్రికి నిద్ర పట్టట్లేదు. రాజకీయంలో సర్వసాధారణమైన పార్టీల మధ్య పొత్తు అంశంపై జగన్మోహన్ రెడ్డిలో అంత కలవరం దేనికి?, అవినీతిపరుడు, అరాచకవాది చేతుల్లో నుంచీ రాష్ట్రాన్ని కాపాడాలన్న ప్రజల అభిమతం మేరకే పొత్తులు ఉంటాయి. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా 1977లో దేశంలో జనతా పార్టీ నేతృత్వంలో జనసoగ్, వామపక్ష పార్టీలన్నీ ఒక్కటి కాలేదా? 1985లో రాష్ట్రంలో బీజేపీ, వామపక్షాలు.. టీడీపీతో కలిసి కాంగ్రెస్‌ను ఓడించలేదా?.’’ అని సోమిరెడ్డి గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa