అమరావతి భూముల్లో లక్షా 50 వేల మందితో ఓటు బ్యాంకును సృష్టించాలని జగన్ చేసిన కుతంత్రానికి సుప్రీంకో ర్టు అడ్డుకట్ట వేసిందని జై భీం పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రవణ్కుమా ర్ చెప్పారు. భవిష్యత్లో జగన్ చేసే దుర్మార్గపు చర్యలకు రైతులు బలవ్వకుండా, థర్డ్ పార్టీ హక్కులు కల్పించకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు శుభసూచకమన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. ప్రభుత్వం ఇతర ప్రాంతాల వారికి పట్టాలు ఇచ్చినా.. బుధవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం లబ్ధిదారులకు వాటిపై ఎలాంటి హక్కులూ ఉండవని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం పేదలను జగన్ తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. జూలైలో సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పులో అమరావతి రైతులకు పూర్తి స్థాయిలో విజయం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.