ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 18, 2023, 01:41 PM

కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉల్చాల రోడ్డు సమీపంలో ఉన్న వసుంధర అపార్టుమెంట్‌లో సువర్ణ కుమారి (44) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. సీఐ శంకరయ్య తెలిపిన వివరాల మేరకు వివరాలు... కడప జిల్లాకు చెందిన జేమ్స్‌, సువర్ణ కుమారీలు భార్యభర్తలు. వీరికి ఒక కూతురు సంతానం. సువర్ణ కుమారి గత కొద్ది కాలంగా ప్రొద్దు టూరు చెందిన ప్రశాంత్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగి స్తుంది. ఈ విషయంపై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగాయి. పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ప్రశాంత్‌ కర్నూలులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తూ ఉల్చాల రోడ్డులో వసుందర అపార్టుమెంటులో నివాసముంటున్నారు. కూ తురు చదువు కోసం సువర్ణ కుమారి ఈ నెల 13వ తేదీన కర్నూలు వచ్చింది. వసుంధర అపార్టుమెంట్‌లో నివాసముంటున్న ప్రశాంత్‌ ఇంటికి ఆదివారం వచ్చింది. ప్రశాంత్‌ ఇంట్లో లేని సమయంలో బుధవారం సువర్ణ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. భర్త జేమ్స్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com