ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద విధులు నిర్వహించే ఉద్యోగులకు 010 పద్దు కిందనే జీతాలు ఇచ్చేందుకు ఆర్థికశాఖ ఆమోదించింది. వీరికి ఈ పద్దు స్థానంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను తీసుకువచ్చేందుకు ఆర్థికశాఖ ఇటీవల ప్రయత్నించిం ది. 010 పద్దును రద్దు చేసింది. అయితే ఈ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు ఏ విధంగా సీఎ్‌ఫఎం్‌సలో అప్‌లోడ్ చేయాలో స్పష్ట త ఇవ్వలేదు. దీంతో ఆరోగ్యశాఖలో దాదాపు 6వేల మందికి జీతాలు నిలిచిపోయాయి. వీరితో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద విధులు నిర్వహించే అన్ని శాఖల ఉద్యోగుల కూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఎం విధివిధానాలతో పాటు ఉద్యోగుల జీతాలు కేంద్రమే భరిస్తుందన్న విషయాన్ని ఆరోగ్యశాఖ అధికారులు వివరించడంతో 010 పద్దుతో జీతాలు చెల్లించేందుకు ఆమోదించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa