ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, రిమాండ్ లో ఉన్న అఖిలప్రియను పోలీసులు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమ ఆరోగ్యం బాలేదంటూ ఆమె కోర్టులో పిటిన్ వేయడంతో, కోర్డు ఆదేశాలతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి, అడ్మిట్ అవసరం లేదని పంపించేశారు.