భార్యను హనీమూన్ కు తీసుకెళ్లడానికి ఓ ప్రబుద్ధుడు అత్తింటివారిని రూ. 10 లక్షలు డిమాండ్ చేసిన యూపీలోని పిలీభీత్ లో జరిగింది. నిందితుడికి ఫిబ్రవరిలో వివాహం జరుగగా, తర్వాత భార్యను దూరం పెట్టాడు. దీనిపై అత్తింటివారు ప్రశ్నించగా హనీమూన్ కోసం రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. వారు రూ. 5 లక్షలు ఇవ్వగా, హనీమూన్ లో భార్య అశ్లీల వీడియోలు తీసి డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.