వివాహ వేడుకలో వధువు మాజీ ప్రియుడు చేసిన నిర్వాకంతో పెళ్లి ఆగిపోయిన ఘటన యూపీలోని గాజిపూర్ జిల్లాలో జరిగింది. ఓ గ్రామానికి చెందిన యువతి, యువకుడు గతంలో ప్రేమించుకొని, విడిపోయారు. ఈ నెల 17న ఆ యువతికి వేరే అబ్బాయితో పెళ్లి జరుగుతుండగా, మాజీ ప్రియుడు వేదిక వద్దకు వచ్చి వధువు నుదుటన సింధూరం దిద్దాడు. దీంతో వరుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. గ్రామస్తులు నిందితుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa