దేశంలో కొత్తగా 8 నగరాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ జీ20 యూనిట్ డైరెక్టర్ ఎంబీ సింగ్ తెలిపారు. ప్రస్తుతం పట్టణాలపై పెరుగుతున్న జనాభా భారాన్ని తగ్గించేందుకు ఈ ప్రణాళికను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆర్థిక సంఘం సిఫార్సు తర్వాత రాష్ట్రాలు 26 కొత్త నగరాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయని, 8 నగరాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.