పేద ప్రజలను చులకనభావంతో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, టీడీపీకి రాష్ట్ర ప్రజలు సమాధి కడతారని మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు. పేదల ఇంటి కలను సాకారం చేయడానికి సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో పేదలకు ఒక్క సెంట్స్థలమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. పేదలంటే చంద్రబాబుకు చులకన భావమని మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుందన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా సీఎం వైయస్ జగన్ విజయం ఖాయం చెప్పారు.